Exercise: ప్రతి రోజూ వ్యాయామం చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిదే!

by D.Reddy |   ( Updated:2025-03-08 15:34:32.0  )
Exercise: ప్రతి రోజూ వ్యాయామం చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిదే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ప్రతి రోజూ అరగంట సేపైనా వ్యాయామం చేయటం తప్పనిసరి. అప్పుడే రోజువారీ పనులు చురుకుగా, చలాకీగా చేసుకోవటం సాధ్యమవుతుంది. వాకింగ్, రన్నింగ్, బస్కీలు, పుషప్స్‌ వంటి అనేక రకాల వ్యాయామాలు శారీరక సామర్థ్యం పెంపొందటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇలాంటి ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి రోజూ వ్యాయామాలు మొదలు పెట్టటానికి ముందు 10 నిమిషాలు వామ్అప్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే కండరాలకు రక్త ప్రసరణ పెరిగి, ఆక్సిజన్‌ మరింతగా అందుతుందని చెబుతున్నారు. బిగుసుకున్న కండరాలు, కీళ్లు వదులుగా మారి.. కదలికలు సాఫీగా సాగి వ్యాయామానికి సాయపడుతుందంటున్నారు. ఇక వ్యాయామాలను ఎప్పుడైనా నెమ్మదిగానే ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. కదలికలను నియంత్రణలో ఉంచుకోవాలని.. ఉన్నట్టుండి అదిరినట్టుగా కదిలితే కండరాలు పట్టేయొచ్చని హెచ్చరిస్తున్నారు.

అలాగే, వ్యాయామం చేసేటప్పుడు కాళ్లు, చేతులకు నొప్పి పుట్టకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. నొప్పి లేనంతవరకే కదలికలను పరిమితం చేసుకోవాలని అంటున్నారు. నెమ్మదిగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ రావొచ్చని సలహా ఇస్తున్నారు. వ్యాయామాలు చేస్తున్నంతా సేపు దృష్టి దానిపైనే ఉండాలని చెబుతున్నారు. ఏకాగ్రతతో గమనిస్తూ చేస్తే శరీర భంగిమ, అమరిక గతి తప్పకుండా చూసుకోవచ్చు. బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేటప్పుడు బరువు ఎత్తినప్పుడు శ్వాసను వదలాలని.. బరువు దించుతున్నప్పుడు శ్వాస తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాయామం అతిగా చేస్తున్నారనటానికి అలసట, నీరసం సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు వ్యాయామాలను ఆపేయాలి.

ఇక వ్యాయామాలను ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆపేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నెమ్మదిగా ముగించాలని సలహా ఇస్తున్నారు. ఉన్నట్టుండి ఆపేస్తే తల తేలిపోతున్నట్టు, తూలినట్టు అనిపించొచ్చని అంటున్నారు. ఫలితంగా కింద పడే ప్రమాదముందని, కాబట్టి కండరాలను సాగదీస్తూ వ్యాయామం ఆపాలని సూచిస్తున్నారు.

* గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడినది. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు నిపుణులను సంప్రదించండి.

Read More ....

Sugarcane juice: చెరుకు రసం-కొబ్బరి వాటర్.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏవి మంచివి?








Next Story