- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండు పారేసిన ఫర్లేదు అరటి తొక్కను ఉంచుకోండి అంటున్న డాక్టర్లు..?!
దిశ, వెబ్‌డెస్క్ః పండ్లు ఏవైనా అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, సాధారణంగా పండ్లలో దాదాపు అన్నీ సీజనల్‌గానే పండుతాయి. కానీ, ఒక్క అరటి పండు మాత్రమే ఏ సీజన్‌లోనైనా కాస్తుంది. అందుకే, రుచిలో మామిడి రాజైనా, అన్ని కాలాల్లో లభ్యమయ్యే అరటి రారాజు! మనలో చాలా మంది అరటిపండ్ల రుచిని ఇష్టపడతారు. నిజమే, అందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే, అన్ని వయసుల వారూ తినడానికి, అన్ని రకాలుగా అనువైన పండు. అయితే, పండు తిన్నాక అరటి తొక్క చెత్తకుప్పలోకి విసిరేస్తారు. ఇదే తప్పు! అంటున్నారు పోషకాహార నిపుణులు. తొక్కను పారేస్తే పండు అందించే దానికంటే చాలా ఎక్కువ లాభాన్ని నష్టపోతారని చెబుతున్నారు. నిజానికి, ఈ అరటి తొక్కల్లోనే పోషక విలువలు అధికంగా ఉంటాయంట.
దీర్ఘకాలిక వ్యాధులకు చెక్
దీనికి సంబంధించి పోషకాహార నిపుణులు కేర్ హాస్పిటల్స్‌లో చీఫ్ క్లినికల్ డైటీషియన్ అయిన జి సుష్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "అరటి తొక్కను నిస్సందేహంగా తినొచ్చు. ఇందులో పొటాషియం, డైటరీ ఫైబర్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్‌లతో పాటు కీలకమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు వ్యాధికారకాలను తగ్గిస్తాయని అన్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా అరటి తొక్క మనల్ని రక్షిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయని" ఆమె వెల్లడించారు.
మానసిక స్థితికి మంచిది
ఇక, అరటిపండులో ఉండే అధిక స్థాయి ట్రిప్టోఫాన్, అరటిపండు తొక్కల్లో ఉండే B6తో కలిపి డిప్రెషన్, ఇతర మానసిక రుగ్మతల లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. ట్రిప్టోఫాన్ విచ్ఛిన్నం కావడం వల్ల సెరోటోనిన్‌గా మారుతుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే, విటమిన్ B6 నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తరచుగా అరటిని తినడం వల్ల అది కాలక్రమేణా మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక, ఫైబర్ అధికంగా ఉండే అరటి తొక్కలు జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడతాయి, మలబద్ధకం, అతిసారం రెండింటినీ సులభతరం చేస్తాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (irritable bowel syndrome) ఉన్నవారికి అరటిపండు తొక్కల వల్ల మంచి ప్రయోజనం" ఉంటుంది అని ఆమె వివరించారు.
ఇలా తినాలి..
అరటి తొక్కను సరిగ్గా ఎలా తినవచ్చో ఆమె వివరించారు. చాలా పండిన అరటిపండ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే, ఈ అరటిపండ్ల తొక్కలు తియ్యగా, సన్నగా ఉంటాయి. ఇక, అరటి పండు తొక్కను బాగా కడగాలి. తర్వాత దాన్ని బ్లెండర్‌లో టాస్ చేయాలి. దీన్ని మీకు ఇష్టమైన స్మూతీ రెసిపీకి జోడించుకోవచ్చు. లేదంటే, బనానా బ్రెడ్ చేసుకొని తినొచ్చు. ఈ తొక్కలను కాల్చి, ఉడకబెట్టి, వేయించుకొని కూడా ప్రయత్నించవచ్చని డాక్టర్ సుష్మా తెలిపారు. మరో పోషకాహార నిపుణురాలు సుజాత ఆర్‌డి మాట్లాడుతూ, "అరటి తొక్క పొడిని ఎక్కువగా చర్మానికి ఉపయోగిస్తారని, అయితే దాన్ని సప్లిమెంట్‌గా కూడా ఉపయోగించవచ్చని" అన్నారు.. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని, తెల్ల రక్త కణాలను కూడా పెంచుతుందని చెప్పారు. అయితే, అరటి తొక్క తినేముందు సరిగ్గా ప్రాసెస్ చేయాలని, తద్వారా అజీర్ణ సమస్య ఉండదని అన్నారు. అలాగే, అరటి తొక్కను తక్కువ మొత్తంలోనే ఉపయోగించాలని సూచించారు. ఇక, అరటి తొక్కును డికాక్షన్, సలాడ్‌లల్లో కూడా ఉపయోగించవచ్చని సలహా ఇస్తున్నారు.