హెల్త్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి

దిశ ప్రతినిధి , హైదరాబాద్: హోం ఐసోలేషన్ కింద చికిత్స పొందుతున్న వైద్యులు, సిబ్బందికి ఐసోలేషన్ వ్యవధిని ఆన్‎డ్యూటీగా ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్‎డీఏ), కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్‎లు సంయుక్తంగా మంత్రి ఈటల రాజేందర్‎ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభిరామ్, డాక్టర్ కిరణ్, డాక్టర్ నిఖిల్, డాక్టర్ శివకాంత్‎లతో పాటు పలు జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీపీహెచ్‎డీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్ధన్ మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన వైద్యులు, సిబ్బందికి ఆన్ డ్యూటీగా ప్రకటిస్తామని మంత్రి గతంలో ఇచ్చిన హామీని జీవో రూపంలో విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కరోనాతో మృతి చెందిన మెడికల్, హెల్త్ సిబ్బందికి ఎక్స్-గ్రేషియా జీవో త్వరగా ఇవ్వాలని.. రెగ్యూలర్ సీఏఎస్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‎ను త్వరగా విడుదల చేయాలని మంత్రికి విన్నవించినట్లు చెప్పారు.

Advertisement