- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్క్రీన్ టైమ్ సైడ్ ఎఫెక్ట్స్.. హార్మోన్లపై ప్రభావంతో అనారోగ్యాలు
దిశ, ఫీచర్స్ : కంప్యూటర్లు, టీవీలు, ఫోన్లు, స్క్రీన్లు ఏవైనా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వాటిని చూసేందుకు కేటాయించే సమయం పెరిగింది. వివిధ సేవలు అన్‌లైన్‌లోకి మార్చబడటం, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వంటి ఇందుకు కారణం అవుతున్నాయి. అయితే స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూ లైటింగ్ ప్రభావంవల్ల కళ్లు, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్కిన్ హెల్త్‌తో పాటు హార్మోన్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
స్క్రీన్‌లకు అధిక సమయం కేటాయించడంవల్ల నిద్రకు, రోగ నిరోధక వ్యవస్థకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా జరగదు. గ్యాప్ లేకుండా వీక్షించడంవల్ల స్లీప్ డిజార్డర్ రుగ్మతకు దారితీస్తుంది. ఇది క్రమంగా ఇమ్యూనిటీ సిస్టమ్‌ను దెబ్బతీస్తుంది, క్యాన్సర్, ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంది. అలాగే స్క్రీన్ల నుంచి వెలువడే లైటింగ్స్ మనలో స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అవడాన్ని ప్రేరేపిస్తాయి. మానసిక, శారీరక ఒత్తిడికి కారణం అవుతాయి. కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కోపంగా, అతి ప్రవర్తన, లోన్లీనెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అధిక స్క్రీన్ సమయం మనం నిద్రపోయే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల మనలో సంతృప్తికి కారణమయ్యే లెప్టిన్ హార్మోన్, అలాగే ఆకలిని నియంత్రించే గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. ఈ కారణంగా ఆకలి మందగించడమో, అధికంగా తినడమో జరుగుతుంది. అధిక బరువు సమస్యకు దారితీస్తుంది.
Read More... పిల్లల ఎదుగుదలకు పేరెంట్స్ తప్పక ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే..