ఎడమవైపునే ఎందుకు పడుకోవాలి.. లాభాలివే !

by Anukaran |
ఎడమవైపునే ఎందుకు పడుకోవాలి.. లాభాలివే !
X

దిశ, వెబ్‌డెస్క్ : పడుకోవడంలో కూడా అనేక నియమాలు పెడుతారు పెద్దలు. అయితే వాటిని మనం పట్టించుకోము. మన పూర్వీకులు పెట్టిన నియమాలలో కొన్ని నియమాలు వినడానికి ఆశ్చర్యంగా అనిపించేలా ఉన్నా ఆ నియమాలను పాటించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే పెద్దల మాట చద్దన్న మూట అంటారు. అందువలన వారు చెప్పినవి విని ఆ నియమాలను పాటించాలి. మనం రోజంతా కష్టపడి శరీరానికి విశ్రాంతినిస్తూ నిద్రపోయే విషయంలో కూడ పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలని, లేదంటే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలని చెప్పారు. అలాగే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని నియమం పెట్టారు. అలాగే కుడివైపు నిద్రపోవడం మంచిది కాదని, ఎడవైపు మాత్రమే నిద్రపోవాలని కూడా చెప్పారు. అయితే ఎడమ వైపు తిరిగి పడుకోవడం ఎందుకు మంచిది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

  • ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గురక తగ్గుతుంది. ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గర్భాశయం, పిండం, మూత్రపిండాలకు అవసరమైన రక్తం అందుతుంది. ఎడమ వైపు తిరిగి పడుకోవడం ద్వారా వెన్ను నొప్పితో పాటు వీపు నొప్పికి కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
  • కడుపులోని ఆమ్లాలు సక్రమంగా పనిచేస్తాయి..తద్వారా గుండెలోని మంటను నిరోధిస్తుంది.
  • ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా లేచి పనులు చేసుకోవటానికి ఈ నిద్ర చాలా ఉపయోకరంగా ఉంటుంది.
  • కొవ్వు పదార్ధాలు తింటే వాటిని సులభంగా జీర్ణం కావటానికి ఉపయోగకరంగా ఉంటుంది.
  • వీపు , మెడ నొప్పుల నుంచి ఉపశమనం కలగడంతో పాటు జీర్ణక్రియ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కిడ్నీలు, కాలేయం సక్రమంగా పని చేయడంతో పాటు శరీరంలోని విషపదార్థాలు, వ్యర్థపదార్థాలు తొలగిపోతాయి. గుండెలోని మంట తగ్గడంతో పాటు గుండె సక్రమంగా పని చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదయం సమయంలో ఉత్సాహంగా ఉండటంతో పాటు కొవ్వు పదార్థాలు సులువుగా జీర్ణమవుతాయి.
  • శరీరంలో వున్న విష, వ్యర్ధ పదార్ధలని తొలగించే రసాయనాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
Advertisement

Next Story