- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీట్‌రూట్‌తో ఎన్ని లాభాలో..?
దిశ, వెబ్‌డెస్క్: మన ఆరోగ్యానికి అవసరమయ్యే పోషక విలువలను అందించే ఆహార పదార్థాల్లో బీట్‌రూట్ ఒకటి. భూమిలో పండే బీట్‌రూట్‌లో ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది. మన రోజువారీ ఆహారంలో దీనిని తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇప్పుడు అవెంటో తెలుసుకుందాం.
బీట్‌రూట్‌ను కేవలం కూరల్లోనే కాదు. వీటితో పలు ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తారు. బీట్‌రూట్ మలబద్దకాన్ని నివారిస్తుంది. ‘అనీమియా’తో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగితే త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు బీట్‌రూట్ అద్భుతంగా సహకరిస్తుంది. దీనిలో ఉండే నైట్రేట్‌లు రక్తపోటును తగ్గిస్తాయి.
డయాబెటిస్‌తో బాధపడేవారు బీట్‌రూట్ తీసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వీటిలో నైట్రేట్లతో పాటు ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియాన్ని వినియోగించుకోవడానికి తోడ్పడే సైలీషియా సైతం బీట్‌రూట్‌లో ఉంటుంది. దీనిలో ఉండే బీటా సైయానిక్‌కు క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంటుంది. రక్తనాళాలు, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది. మన శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు బీట్‌రూట్‌ను తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.
బీట్‌రూట్‌లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డ ఎదుగుదలను ప్రోత్సహించి గర్భిణులకు మేలు చేస్తుంది. బిడ్డ యొక్క వెన్ను ఆరోగ్యంగా వృద్ధి చెందడానికి ఉపయోగకరమైనది. ఇక చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్-బి సైతం బీట్‌రూట్‌లో ఉంటుంది. దీనిని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల ఆరోగ్య, సౌందర్య సమస్యల పరిష్కారానికి బీట్‌రూట్ ఎంతో సహాయపడుతుంది.