కేబీఆర్ పార్క్ వద్ద విషాదం..

by Sumithra |   ( Updated:2021-07-27 23:57:55.0  )
kbr-park
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద మంగళవారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. మార్నింగ్ వాక్ కోసం వచ్చిన వ్యక్తి అనుకోకుండా మృతి చెందాడు. మృతుడు పోలీస్ డిపార్ట్‌మెంటులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన సీఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలాఉండగా జూబ్లీహిల్స్ పరిధిలో గల కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్‌కు వచ్చిన కొందరు విగతజీవిగా పడి ఉన్న సూర్యనారాయణను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన గుండెపోటుతో మరణించి ఉండవచ్చునని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Next Story