- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్ అండ్ బి నిర్లక్ష్యం..హెడ్ కానిస్టేబుల్ బలి

X
దిశ,ఆర్మూర్:ఆర్మూర్ మండలం మాచర్ల గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సత్యపల్ రెడ్డి (50 ) మంగళవారం రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం సత్యపాల్ రెడ్డి విధి నిర్వహణలో డిచ్ పల్లి బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు. మాచర్ల దేగం మధ్యలో రోడ్డు పక్కన ఉన్న బావిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందాడు. ఆర్ అండ్ బి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయ్యిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి , దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మూర్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు
Next Story