తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

by srinivas |
Head Constable suicide
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేణిగుంట ఆర్‌పీఎఫ్‌ బ్యారక్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందరావు ఆదివారం తెల్లవారు జామున తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడు ఆనందరావు శ్రీకాకుళం జిల్లా చింతపోలూరుకు చెందిన వ్యక్తిగా పోలీసుల విచారణలో తేలింది.

ఈ ఘటనపై రేణిగుంట సీఐ అంజూయాదవ్‌ మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు ఇటీవలే సెలవులపై వెళ్లి ఆగష్టు 3న తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో రైల్వే బ్యారక్‌ ఆర్మర్‌ గదిలో కూర్చీలో కూర్చొని తుపాకీతో కాల్చుకుని మరణించినట్లు వెల్లడించారు. ఆనందరావు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అతను విధుల్లో ఉండాల్సి ఉంది. ఉదయం 4 గంటలకు ఏఎస్ఐ రాజు పిస్తోల్‌ను డిపాజిట్‌ చేసేందుకు ఆర్మర్ రూమ్‌కు రాగా హెడ్ కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని సీఐ అంజూయాదవ్ తెలిపారు. ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టామని సీఐ చెప్పారు.

Advertisement
Next Story

Most Viewed