కరోనాతో మాజీ రంజీ ప్లేయర్ మృతి

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ బారిన పడి ఢిల్లీ రంజీ జట్టు మాజీ ప్లేయర్ సంజయ్ దోబల్ (52) సోమరవారం మృతిచెందారు. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. దోబల్ అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నామని, ఆయన మృతి డీడీసీఏకు తీరని లోటని పేర్కొంది. డీడీసీఏ తరఫున దోబల్‌కు నివాళులర్పించిన వినోద్ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దోబల్ మూడు వారాల క్రితమే కరోనా బారిన పడ్డాడు. గత కొన్ని నెలలుగా ఎయిర్ ఇండియా క్రికెట్ జట్టుకు కోచ్‌గా పని చేసి దీర్ఘకాలిక వ్యాధుల నేపథ్యంలో ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సహచర క్రికెటర్ మిథిన్ ఢిల్లీ అసోసియేషన్‌కు తెలిపారు. ‘సంజయ్‌లో మూడు వారాల క్రితమే కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఇక ఆదివారం అతని పరిస్థితి క్షీణించడంతో అత్యవసరంగా ప్లాస్మా ట్రీట్‌మెంట్ కూడా చేయించాం. కానీ, సోమవారం పరిస్థితి విషమించి దోబల్ మృతి చెందాడు’ అని మిథిన్ వెల్లడించాడు.

Advertisement