- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 3,052 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 3,051.5 కోట్లతో 4.7 శాతం క్షీణించిందని వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 3,203.10 కోట్లు కాగా, మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ. 2,232.5 కోట్లుగా నమోదైంది. ఏకీకృత ప్రాతిపదికన పన్ను తర్వాత లాభం రూ. 4,059 కోట్లుగా ఉంది. ఇది 15 శాతం వృద్ధి అని హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఇక, సమీక్షించిన త్రైమాసికంలో ఆదాయం రూ. 13,017.7 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. తొలి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ. 3,392 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇది రూ. 3,079 కోట్లుగా ఉంది. లిక్విడిటీ, లిక్విడిటీ పెట్టుబడుల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ త్రైమాసికంలో సర్దుబాటు చేసిన నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 3,609 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జి 3.3 శాతంతో పోలిస్తే 3.1 శాతంగా ఉంది. ఇక, ఆదాయ నిష్పత్తి 9 శాతంగా ఉన్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది.