- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నికర లాభం రూ. 311 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి నాలుగవ త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ రూ. 311.71 కోట్ల నికరలాభాన్ని వెల్లడించింది. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 364.01 కోట్లతో పోల్చితే 15 శాతం తగ్గినట్టు సంస్థ ప్రకటించింది. ఇదే క్రమంలో సంస్థ మొత్తం ఆదాయం రూ. 14,375.06 కోట్ల నుంచి ఏకంగా రూ. 418.64 కోట్లకు తగ్గినట్టు పేర్కొంది. పెట్టుబడులపై ఆదాయం రూ. 10,229.92 కోట్ల వరకూ హరించుకుపోవడం, కరోనా సంక్షోభమే దీనికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వివరించింది.
నికర ప్రీమియం వసూళ్లు స్వల్పంగా పెరిగి రూ. 10,464.46 కోట్లకు చేరినట్టు స్పష్టం చేసింది. సంస్థ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 1.3 లక్షల కోట్లని, కొత్త వ్యాపార విలువ అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగి రూ. 1919 కోట్లని సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రజల జీవితంపై ప్రతికూల ప్రభావం ఉండటంతో సంస్థలు సవాళ్లు పెరిగాయని, అయినప్పటికీ పరిశ్రమ సగటు కంటే మెరుగ్గానే ఉన్నామని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ,సీఈవో విభా చెప్పారు.
Tags: HDFC Life Insurance, Q4 results, coronavirus, covid-19