ఆ జాబితాలో ఏకైక భారతీయుడు

by Harish |
ఆ జాబితాలో ఏకైక భారతీయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోర్బ్స్ నిర్వహించిన ‘ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సీఎంవో’ల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్(సీఎంవో) రవి సంతానం చోటు సంపాదించుకున్నారు. యాపిల్, బీఎండబ్ల్యూ, అడోబ్, మైక్రోసాఫ్ట్, లెగో, పీ అండ్ జీ కంపెనీల మార్కెటింగ్ హెడ్‌లతో కూడిన ఈ జాబితాలో రవి సంతానం మాత్రమే ఏకైక భారత కంపెనీకి చెందిన సీఎంఓగా ఉన్నారు. ఆయన ఈ జాబితాలో 39వ స్థానాన్ని దక్కించుకున్నారు.

స్ప్రింక్లర్, లింక్‌డ్ఇన్ సంస్థల భాగస్వామ్యంతో ఫోర్బ్స్ విడుదల చేసిన ఎనిమిదవ ఎడిషన్‌లో అంతర్జాతీయంగా మొత్తం 427 గ్లోబల్ సీఎంవోలు ఈ జాబితా పరిశీలనకు అర్హులయ్యారు. ప్రముఖ పత్రికలు, సోషల్ నెట్‌వర్క్, ఇతర డేటాను ఉపయోగించి ఈ జాబితాను సిద్ధం చేసినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ‘రవి సంతానం కస్టమర్లకు ప్రాధాన్యతనిచ్చే అనుభవం కలిగిన మార్కెటింగ్ లీడర్. అలాగే, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మార్కెటింగ్‌కి కీలకమైన సాధనాలని నమ్మే వ్యక్తి’ అని ఫోర్బ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది.

అంతేకాకుండా, ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు స్పందనగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రత్యేక నినాదంతో ప్రచారం ప్రారంభించారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఫోర్బ్స్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో తాను చోటు దక్కించుకోవడం గర్వంగా ఉందని, ఈ గుర్తింపు ప్రతికూల సమయాల్లోనూ తమ బ్యాంకు ఎలా పనితీరును కనబరిచిందో, లాక్‌డౌన్ తర్వాత ప్రజల ఆరోగ్యం, భద్రత పట్ల తమ సామాజిక బాధ్యతను నెరవేర్చే బాధ్యతను గుర్తు చేసినట్టు రవి సంతానం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed