- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హెచ్‌సీఎల్ టెక్నాలజీలో 10 వేల నియామకాలు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆధునిక కాలంలో అనేక అంతర్జాతీయ సంస్థలు క్లౌడ్ టెక్నాలజీకి మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్(ఏడబ్ల్యూఏస్ బీయూ)ను ప్రారంభించింది. చాలా సంస్థలు క్లౌడ్‌కి మారేందుకు సిద్ధమవుతున్నాయని, దీన్ని మరింత వేగవంతం చేయడానికి ఈ వ్యాపార విభాగాన్ని మొదలుపెట్టినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
దీనికోసం హెచ్‌సీఎల్ ఏడబ్ల్యూఎస్ వ్యాపార విభాగంలో 10,000 మందిని నియమించనుంది. ఇది హెచ్‌సీఎల్ సంస్థలోనే ఒక విభాగంగా ఉంటుందని, దీనికోసం ఏడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్‌లు సహకరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ‘హెచ్‌సీఎల్ ప్రస్తుతం ఐదు ఏడబ్ల్యూఎస్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఇందులో శిక్షణ పొందిన నిపుణులు 10,000 కంటే ఎక్కువమంది ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 20,000 కంటే ఎక్కువకు పెంచాలని భావిస్తున్నాం’ అని కంపెని వివరించింది.
అంతేకాకుండా క్లౌడ్ టెక్నాలజీ నిర్మాణం, పనితీరు, పటిష్ఠమైన క్లౌడ్ వ్యవస్థ ద్వారా ప్రతి అంశానికి సంబంధించి వినియోగదారుకు సేవలందించడానికి ఏడబ్ల్యూఎస్ బీయూ సహకారం అందించనున్నట్టు హెచ్‌సీఎల్ టెక్నాలజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కళ్యాణ్ కుమార్ తెలిపారు. వ్యాపారాల్లో భవిష్యత్తు టెక్నాలజీ వినియోగించడానికి ఈ విభాగం వ్యూహాత్మకంగా కీలకమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.