- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరాశపరిచిన హెచ్‌సీఎల్ టెక్నాలజీ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెక్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 3,265 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 1.6 శాతం వృద్ధి కాగా, గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 3.9 శాతం ఎక్కువ అని కంపెనీ తెలిపింది. సంస్థ ఆదాయం గతేడాది కంటే 11.1 శాతం పెరిగి రూ.20,655 కోట్లకు చేరుకుంది. అయితే, హెచ్‌సీఎల్ టెక్ ఈసారి నిరాశజనకమైన ఫలితాలను వెల్లడించిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ, సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ అనేక ఒప్పందాలను చేసుకుందని, వీటి కోసమే ఎక్కువగా ఖర్చు చేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘మొత్తం 14 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేశామని’ హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సి విజయకుమార్ అన్నారు. ఇటీవల అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, పర్యావరణ, సామాజిక, నిర్వహణ విభాగల్లో సంస్థ మరిన్ని చర్యలను, పెట్టుబడులను వేగవంతం చేస్తుందని సంస్థ చైర్‌పర్శన్ రోష్ని నాడార్ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో గురువారం హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్ ధర 1.12 శాతం నష్టపోయి రూ.1251.15 వద్ద ట్రేడయింది.