కానిస్టేబుల్ పై కేసు పెట్టిన SI.. ఎందుకంటే?

by Sumithra |
crime
X

దిశ‌, హ‌త్నూర‌ : ఎవ‌రైనా త‌ప్పు చేస్తే అలా చేయొద్దని చెప్పాల్సిన పోలీసు అధికారే ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మ‌ట్టిని త‌ర‌లిస్తున్నాడు. ఈ ఘ‌ట‌న ఉమ్మడి మెదక్ జిల్లాలోని హత్నూర మండ‌ల ప‌రిధిలోని న‌స్తీపూర్ గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివ‌రాల్లోకెళితే.. హ‌త్నూర మండ‌లంలోని పోలీస్‌స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ర‌ఫీ మండ‌ల ప‌రిధిలోని న‌స్తీపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మ‌ట్టిని త‌ర‌లిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న గ్రామ వీఆర్‌ఏ ఆంజ‌నేయులు గురువారం హ‌త్నూర ఎస్ఐ ల‌క్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఎస్‌ఐ కానిస్టేబుల్‌పై కేసు న‌మోదు చేశారు.

ఇదే విషయంపై ఎస్‌ఐ ల‌క్ష్మారెడ్డి వివ‌ర‌ణ కోరగా ప్రభుత్వ భూముల నుంచి కానిస్టేబుల్ మ‌ట్టిని త‌ర‌లిస్తున్నట్లు వ‌చ్చిన ఫిర్యాదు వాస్తవ‌మే. ఈ మేరకు విచారణ జరిపి కేసు న‌మోదు చేశాం. ఇదే విష‌యం ఉన్నతాధికారుల‌కు కూడా నివేదించాము. పై అధికారుల నుంచి వచ్చే ఆర్డర్స్ ప్రకారం త‌దుప‌రి చ‌ర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story