పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న హసన్అలీ

by Shyam |
Hasan Ali pulls out of PSL 6 due to personal reasons
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ మిగిలిన లీగ్ మ్యాచ్‌లను నుంచి తప్పుకున్నాడు. కుటుంబ కారణాలతో అతడు పీఎస్ఎల్ ఆడబోవడం లేదని.. అబుదాబి నుంచి పాకిస్తాన్ తిరిగి ప్రయాణం కానున్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. ‘అనుకోకుండా తాను పీఎస్ఎల్‌ను వీడాల్సి వస్తున్నది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. అవి నాకు క్రికెట్ కంటే ముఖ్యమైనవి. అందుకే ఈ సమయంలో కుటుంబంతో ఉండాలని భావిస్తున్నాను. ఇస్లామాబాద్ యునైటెడ్ అభిమానులు ఈ విషయాన్ని అర్దం చేసుకుంటారని భావిస్తున్నాను’ అని ఒక ప్రకటన చేశాడు. హసన్ అలీ లేకపోవడం ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే అని భావించాలి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఇస్లామాబాద్ జట్టు రెండో స్థానంలో ఉన్నది.


Next Story

Most Viewed