- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఆధార్ కార్డు హ్యాక్ అయిందా..? ఇలా చేయండి!
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాధాన్యత మరే గుర్తింపు లేదనడంతో సందేహం లేదు. అంత ముఖ్యమైన ఈ కార్డును ఎంతో జాగ్రత్తగా వాడుకోక తప్పదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. మీ పేరుతో ఇతరులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నది. మీ విలువైన సమాచారాన్ని కొల్లగొట్టడంతోపాటు ఆర్థికంగానూ నష్టపరచవచ్చు. అందుకే మీ ఆధార్ కార్డు హ్యాక్ కాకుండా జాగ్రత్త పడాలి. మరి మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందా..? లేదా అని తెలుసుకోవాలంటే ఎలా? దానిని సెక్యూరిటీగా ఎలా కాపాడుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోవాంటే ఈ కథనం చదవాల్సిందే.
మీ ఆధార్ కార్డు హ్యాక్ కాకుండా లాక్ చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.
☛ మొదట https://resident.uidai.in/ ని ఓపెన్ చేయాలి.
☛ ‘మై ఆధార్’ విభాగంలో ‘ఆధార్ సర్వీస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
☛ Lock/Unlock Biometrics అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకోవాలి.
☛ మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.
☛ క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
☛ OTP ఎంటర్ చేసిన తర్వాత, బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే ఎంపిక ఉంటుంది.
☛ బయో మెట్రిక్ డేటాను లాక్ చేయండి.
ఇలా చేస్తే మీ ఆధార్ కార్డు భద్రంగా ఉంటుంది. మీకు ఇంటర్ నెట్‌పై అవగాహన ఉంటే ఇంట్లో నుంచి ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు. లేదా మీ సేవా కేంద్రాల్లో ఈ సేవలను వినియోగించుకోవచ్చు.