Mr.India సీక్వెల్‌పై కపూర్ బ్రదర్స్ వార్

by Shyam |   ( Updated:2020-02-25 00:56:52.0  )
Mr.India సీక్వెల్‌పై కపూర్ బ్రదర్స్ వార్
X

దిశ, వెబ్‌డెస్క్:

Mr.India బాలీవుడ్ క్లాసికల్ మూవీ. శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీ దేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బోనీ కపూర్ నిర్మాత. సైన్స్ ఫిక్షన్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అందుకే 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్. జీ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో Mr.India 2 తెరకెక్కిస్తున్నట్లు అలీ అబ్బాస్ అధికారికంగా ప్రకటన ఇచ్చారు. తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే ఈ ప్రకటనే బాలీవుడ్‌లో వివాదానికి దారి తీసింది. డైరెక్టర్ శేఖర్ కపూర్, లీడ్ యాక్టర్ అనిల్ కపూర్‌లను సంప్రదించకుండా సీక్వెల్ ఎలా ప్లాన్ చేస్తారని, అధికారికంగా ఎలా ప్రకటిస్తారని అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ మండిపడ్డారు. ఒక క్లాసికల్ మూవీ తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది? ఎంత మంది రాత్రింబవళ్లు శ్రమిస్తారు? కనీసం వారికి మర్యాద ఇవ్వాలి కదా? అని క్లాస్ పీకింది. డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా సీక్వెల్‌ను ఖండించారు. తమకు తెలియకుండా ప్లాన్ చేయడం బాగాలేదని, కేవలం వీకెండ్ కలెక్షన్స్ కోసమే Mr.India సినిమా పేరును వాడుతున్నారని విమర్శించారు.

కానీ, సినిమా నిర్మాత అయిన బోనీ కపూర్ Mr.India సీక్వెల్‌కు అనుమతిచ్చారు. ఒక నిర్మాతగా ఆయనకు ఆ హక్కు ఉంటుందని అంటున్నారు సినీ ప్రముఖులు. అందుకే అతను పర్మిషన్ ఇచ్చి ఉంటాడని అంటున్నారు. అయితే ఈ విషయంలో కపూర్ బ్రదర్స్ అనిల్ కపూర్, బోనీ కపూర్‌ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. అనిల్‌ను అడగకుండా బోనీ జీ స్టూడియోస్‌కు సీక్వెల్ తీసేందుకు పర్మిషన్ ఇవ్వడం ఆ కుటుంబంలో కలతలకు కారణం అయిందని చెబుతున్నారు.

Advertisement

Next Story