‘రజత పతక’ వీరుడికి భారీ నజరానా..

by Shyam |   ( Updated:2021-08-05 08:04:27.0  )
ravikumar-dahiya-..-haryana
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించిన రవికుమార్ దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.4 కోట్ల పారితోషికంతో పాటు క్లాస్ వన్ కేటగిరికి చెందిన ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా రవికుమార్ దహియా కోరుకున్న చోట ఓ ప్లాట్ కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దహియా స్వగ్రామం నహ్రిలో రెజ్లింగ్ క్రీడను ప్రోత్సహించేందుకు ఇండో స్టేడియం నిర్మించనున్నట్టు కూడా స్పష్టంచేసింది.

అయితే, ఒలంపిక్స్ చరిత్రలో రజత పతకం సాధించిన రెండో క్రీడాకారుడిగా రవి దహియా రికార్డు నెలకొల్పగా.. మొదటి ఒలింపిక్ సిల్వర్ మెడల్‌ను ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ పేరున ఉంది. ప్రస్తుతం సుశీల్ కుమార్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లడం వలన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోయిన విషయం తెలిసిందే.


Next Story