వరంగల్ అర్బన్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా హరిత

by Shyam |

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా ఇదివరకే రూరల్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న హరిత‌ నియామకం అయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఆగస్టు 7 వరకు అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మెడికల్ సెలవుపై వెళ్తున్నారు. అందువల్లే ఆమెకు వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా కొనసాగనున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed