సిద్దిపేట ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి..

by Sridhar Babu |   ( Updated:2021-11-19 23:41:16.0  )
harishrao-1
X

దిశ, సిద్దిపేట: అత్యవసర సమయంలో అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను జెండా ఊపి మంత్రి ప్రారంభించి సిద్దిపేట జీజీహెచ్ కు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్ సిద్దిపేట ఆసుపత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్, గాంధీ, టెరిసరీ ఆసుపత్రులకు తీసుకువెళ్తుందని మంత్రి చెప్పారు. ఇప్పటికే జీజీహెచ్ ఆసుపత్రిలో సీఏంఆర్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు చిన్న అంబులెన్స్ లు అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్నాయని, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఎమర్జెన్సీ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగకరమని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ అంబులెన్స్ లో డ్రైవర్ తో పాటు ఇద్దరు టెక్నీషియన్లను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ ఆదేశించారు.

అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సదుపాయాలు

అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లో అత్యాధునిక 45 రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. స్పెన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ చైర్, బ్యాగ్ మాస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారని మంత్రి పేర్కొన్నారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారని ఆరోగ్య మంత్రి హరీశ్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహనాలు 429 ఉన్నాయని, మరింత మెరుగ్గా 108 సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. పాత వాహనాలు తొలగించి అవసరం అయిన చోట కొత్త వాహనాలు కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed