- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏదో ఒకటి చేసి.. : హరీశ్‌రావు
దిశ ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతు కళ్లలో ఆనంద భాష్పాలు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్లలో మాత్రం కనీళ్లు వస్తున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు ఎక్కడ వస్తుందోనని, ఏదో ఒకటి చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు-డీసీసీబీ బ్యాంకును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యన ఉండి మాట్లాడుతుంటే, కాంగ్రేస్ నేతలు గాంధీ భవన్ లో కూర్చుని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ప్రజలకు సేవకులుగా పని చేస్తూ.. కరోనా విషయమై జనానికి ధైర్యం చెప్పి, జనం మధ్యలోనే ఉంటున్నామన్నారు. 70 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలు పరిపాలిస్తే.. చేయని పనిని 6 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసి చూపిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.