ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ అమలుపై స్పష్టతనిచ్చిన హరీశ్ రావు

by Shyam |   ( Updated:2021-06-08 05:07:49.0  )
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ అమలుపై స్పష్టతనిచ్చిన హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు జీఓ వెలువడుతుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జూన్ నెల జీతం పీఆర్సీతో కలిపి తీసుకోవచ్చునని, ఆ దిశగా సీఎం కేసీఆర్.. అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. మంగళవారం రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు తన దగ్గరికి వచ్చిన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధి బృందం(ట్రెసా)తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వివిధ క్యాడర్లలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలు, అన్ని క్యాడర్ల సమస్యలు పరిష్కరించాలని ట్రెసా బృందం సభ్యులు కోరారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో క్యాడర్ స్ట్రెంత్ ఏర్పాటు, ఉద్యోగులకు నెల నెల వేతనాలు, కొవిడ్ అత్యవసర సమయంలో రెవెన్యూ సేవలు, ధరణి సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు వంటి సేవల్లో రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రికి వారు తెలిపారు. ఆయా క్యాడర్లలో ఖాళీల భర్తీ చేపట్టాలని ట్రెసా విజ్ఞప్తి చేసింది. దీనికి మంత్రి స్పందిస్తూ.. వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed