ఆ విషయమై ట్విట్ చేసిన మంత్రి హరీశ్ రావు

by  |
ఆ విషయమై ట్విట్ చేసిన మంత్రి హరీశ్ రావు
X

దిశ ఫ్రతినిధి, మెదక్: రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం రైతుబంధు పథకం కోసం 2 సీజన్లలో రూ. 14 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు మంత్రి ట్విట్టర్‌లో తెలిపారు. రాష్ట్రంలో రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇవాళ ఒకే రోజు రూ .50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం రూ . 5,294.53 కోట్లు జమ చేసిందన్నారు. జూన్ 16 వరకు పాస్ బుక్ వచ్చిన ప్రతి ఒక్కరికి రైతుబంధు అందనుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో రైతుబంధు విడుదల చేసిందని తెలిపారు. నియంత్రిత వ్యవసాయ సాగువిధానంకు సహకరించి ప్రభుత్వం సూచించిన పంటలను వేసి లాభాలు గడించాలని కోరారు.


Next Story