- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కారు భూములమ్మే కసరత్తు: హరీశ్‌రావు
కేంద్రం నుంచి నిధుల కోత ఉన్నా సంక్షేమ రంగాలను కొనసాగించాలనే ఉద్దేశంతో అప్పులు చేయక తప్పడంలేదని, సర్కారు భూములను అమ్మాలనే నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా పుంజుకుందని, ప్రభుత్వం సర్కారు భూముల్ని అమ్మేందుకు కసరత్తు చేస్తూ ఉందని సమర్ధించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలంటే ఆదాయ వనరులు అవసరమవుతాయని, కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవి కూడా తగ్గిపోతున్నందున స్వీయ ఆర్థిక వనరులపై దృష్టి పెట్టక తప్పడంలేదన్నారు. మరోవైపు జీఎస్టీ కటాఫ్ నిధులు కూడా కేంద్రంతో కొట్లాడి మరీ తెచ్చుకున్నామని గుర్తుచేశారు. కేంద్రం నుంచి సకాలంలో వివిధ రకాల పన్ను పరిహారం అందడంలేదని గుర్తుచేశారు. ఇంకా కేంద్రం నుంచి సుమారు రూ. 933 కోట్లు రావాల్సి ఉందన్నారు.
ఈ సారి బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు చాలా పెట్టామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ. 10 వేల కోట్లు, ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, కందుల కొనుగోళ్ళ విషయంలో రైతులకు నష్టం రాకుండా మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద మరో రూ.వెయ్యి కోట్లను కేటాయించామన్నారు. ఆసరా పింఛను లబ్ధిదారుల అర్హతా వయసును కుదించడం వల్ల కొన్ని వేల మంది అదనంగా ప్రయోజనం పొందుతారని, అందువల్లనే ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వచ్చిందన్నారు. అక్షరాస్యత విషయంలో చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ వెనకబడి ఉన్నందున ఆ లోపాన్ని సరిదిద్దుకోడానికి అదనంగా రూ.వంద కోట్లను కేటాయించామని తెలిపారు. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీలోకి రావడానికి ముందే బడ్జెట్ ప్రతులను ఆలయంలో దేవుడి ముందు ఉంచి ప్రార్థనలు చేశారు.
tags: Telangana, Budget, Harish Rao, Central Funds, Loans