‘త్వరలో పెండింగ్ జీతాల పై నిర్ణయం’

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన నిధులు రాలేదని తెలంగాణ శాసన మండలిలో మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బకాయిల విడుదల కోసం కేంద్రానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వరకు నిధులు రావాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా నివారణకు రూ. 5 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్న హరీశ్ రావు.. ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో వాయిదా వేసిన మొత్తంను ఎలా చెల్లించాలనే దానిపై ఈ నెలాఖరు లోపు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement