- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హూజురాబాద్‌లో హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. టార్గెట్ అదే
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దుబ్బాక సీన్ రిపీట్ కావద్దు, పోలీసుల ప్రమేయం గణనీయంగా తగ్గించాలి, ఈటలను డైరెక్ట్ అటాక్ చేస్తూ ప్రజల్లో పట్టు సాధించే ప్రయత్నం చేయాలని మంత్రి హరీష్ రావు వ్యూహాత్మకంగా వేసిన స్కెచ్ ఇది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలీసుల జోక్యం తీవ్రం కావడం వల్ల ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నామని గుర్తించిన మంత్రి హరీష్ రావు హుజురాబాద్‌లో వ్యూహాత్మంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నాయకులతో చర్చించినప్పుడు ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. పార్టీ శ్రేణులు ఏ మాత్రం తప్పటడుగులు వేసినా ఈటల రాజేందర్‌కు అనుకూలత పెరిగే అవకాశం ఉన్నందున ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తరువాతే ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఓటర్లలో సానుకూలతే ముఖ్యం…
ఈటల రాజేందర్‌పై ఉన్న సానుభూతికి చెక్ పెట్టి టీఆర్ఎస్‌కు అనుకూలంగా మల్చుకునే పనిలో నిమగ్నం అయ్యేందుకు వ్యూహం రచించినట్టు సమాచారం. హుజురాబాద్‌లోని వార్డుల వారీగా వివరాలు సేకరించిన హరీష్ రావు క్షేత్ర స్థాయిలో పార్టీకి అనుకూలతలు, ప్రతికూలతలు ఏంటి అన్న సమాచారం తెలుసుకున్నారు. ఎక్కడ అయితే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ బలం పెంచుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలుస్తుంది.
45 రోజులు.. 30 వేల మంది
హుజురాబాద్‌లో అడుగుపెట్టకుండానే హరీష్ రావు నియోజకవర్గంలోని 30 వేల మందితో వ్యక్తిగతంగా కలిశారు. దాదాపు 45 రోజుల పాటు సిద్దిపేట, రంగనాయక సాగర్‌లో హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల్లోని వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు 30 వేల మందితో వ్యక్తిగతంగా కలసి ఈటల రాజేందర్ పార్టీకి దూరం కావడానికి కారణాలు ఏంటీ అన్న విషయాలపై కులంకుశంగా చర్చించారు. ఈటల ప్రభావాన్ని తగ్గించాలంటే ఎలా ముందుకు సాగాలి, ప్రజల్లో మరింత పట్టు బిగించేందుకు ఏం చేయాలి అన్న విషయాలపై క్లారిటీగా స్కెచ్ వేసుకున్నారు. ఈ నేఫథ్యంలోనే హుజూరాబాద్‌లో మొదటి సారి పర్యటించిన హరీష్ రావు ఉప ఎన్నికలో తన ప్రభావం ఏంటో చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఎత్తుగడతో ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేశారనే చెప్పాలి. అటు యువతను, ఇటు మహిళలను ఆకట్టుకోవడంలో భాగంగా హరీష్ వేసిన తొలి అడుగుతోనే భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోతున్నాడో అన్న సంకేతాలను ఇచ్చేశారు.
ఈటల కోటే టార్గెట్…
హుజురాబాద్‌లోని ఐదు మండలాల్లో ఈటల రాజేందర్‌కు అత్యంత పట్టున్న ప్రాంతాలను గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో మొదటి వరుసలో కమలాపూర్ మండలం నిలిచింది. ఈ మండలంలో టీఆర్ఎస్ పట్టు సాధించేందుకు భారీ స్కెచ్ వేసినట్టు సమాచారం. సర్కారుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాలంటే ఇక్కడి ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను తొలగించే విధంగా గ్రౌండ్ వర్క్ చేయాలని భావిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఈటల సానుభూతిని తగ్గించి టీఆర్ఎస్ అనుకూలతను మల్చే విధంగా వ్యవహరించేందుకు కూడా కసరత్తులు చేస్తున్నారు.