‘దిల్ బెచారా’ దిల్ జీత్ గయా : తమిళ హీరో

by Shyam |
‘దిల్ బెచారా’ దిల్ జీత్ గయా : తమిళ హీరో
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం అయిన దిల్ బెచారా ట్రైలర్, టైటిల్ ట్రాక్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. సింగిల్ టేక్‌లో టైటిల్ ట్రాక్ పూర్తి చేసిన సుశాంత్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. తను తప్ప మరే నటులు చేయలేరని కొనియాడారు.

ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, సుశాంత్ డ్యాన్స్.. ఫ్యాన్స్‌ను దిల్ బెచారా టైటిల్ ట్రాక్‌తో లవ్‌లో పడేసింది. కాగా జెర్సీలో నాని కొడుకుగా నటించిన తమిళ హీరో హరీష్ కళ్యాణ్ సైతం ఈ పాటకు ఫిదా అయిపోయానంటూ ట్వీట్ చేశాడు. పదే పదే అదే పాట వింటున్నట్లు తెలిపాడు. అంతేకాదు తనే పియానో ప్లే చేస్తూ, పాట పాడుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు హరీష్. సుశాంత్ అండ్ ఫ్యాన్స్‌కు ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు చెప్పిన యంగ్ హీరో.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎప్పటిలాగే మెస్మరైజ్ చేసిందని.. ఇంత మంచి పాట అందించిన రెహమాన్‌కు థాంక్స్ చెప్పాడు.

Advertisement

Next Story