ఆధునాతన హంగులతో గజ్వేల్ పార్క్

by  |
ఆధునాతన హంగులతో గజ్వేల్ పార్క్
X

దిశ, గజ్వేల్: ఆధునాతన హంగులతో గజ్వేల్ పార్కును ఆధునీకరిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రాజీవ్ పార్కు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్కును అభివృద్ది చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. పార్కును వాస్తు ప్రకారం జాగింగ్, వాకింగ్, యోగా కేంద్రాలతో పాటు గజబౌలిలు, చిన్నారులు ఆడుకునే విధంగా చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

పార్కు పునరుద్ధరణకు మరింతగా అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే గజ్వేల్ మున్సిపాలిటీలో రూ.100 కోట్లతో యూజీడీ పనులను చేపట్టామని, యూజీడీకి అనుసంధానంగా 4 చోట్ల ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గజ్వేల్‌లో పునరుద్ధరణ చేస్తున్న పార్కు ఆధునాతన సౌకర్యాలతో.. ఆహ్లాదకరంగా ఉండేలా పార్కును తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. యూజీడీ పనులు తొందరగా పూర్తి చేయాలని, గజ్వేల్ లో నాలుగు ఎస్టీపీ, యూజీడీ పైపులైన్ల పనులు కూడా శరవేగంగా జరగాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.


Next Story