ఆగండి..ఎయిర్ టికెట్ల బుకింగ్ ఇప్పుడు కాదు!

by Harish |
ఆగండి..ఎయిర్ టికెట్ల బుకింగ్ ఇప్పుడు కాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌లైన్స్ సంస్థలకు లాక్‌డౌన్ గండం తప్పేలా లేదు. ఇదివరకూ ఏప్రిల్ 14 తర్వాత టికెట్ బుకింగ్స్ ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ కొవిడ్-19 వ్యాప్తి వల్ల లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. దీంతో బుకింగ్ చేసుకున్న టికెట్లను రద్దు చేయడమే కాకుండా, ప్రభుత్వ జోక్యంతో టికెట్ల సొమ్మును కూడా తిరిగివ్వాల్సి వచ్చింది. తాజాగా, ఇండిగో, శనివారం ఎయిర్ ఇండియా మే 4 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని చెప్పాయి. అయితే, రాత్రికి రాత్రి ప్రభుత్వం ఎయిర్‌లైన్ సంస్థల ప్రకటనను ఖండించింది. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందే వరకూ ఎలాంటి ఎయిర్‌లైన్ టికెట్ల బుకింగ్స్ ప్రారంభించొద్దని స్పష్టం చేసింది.

ప్రభుత్వం రంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 4 నుంచి దేశీయ, జూన్ 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపేందుకు టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నామని. వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి వివరాలను ఇచ్చింది. ఇది తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన సంస్థ వెంటనే ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సర్వీసులు ఎప్పటినుంచి ప్రారంభించనున్నది కేంద్రం నిర్ణయించలేదని, కేంద్రం చెప్పిన తర్వాతే ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్స్ ప్రారంభించాలంటూ వివరణ ఇచ్చారు. ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఎయిర్ ఇండియా బుకింగ్స్ నిలిచిపోయినట్లే. విమాన ప్రయాణాలకు టికెట్ బుకింగ్స్ ఎప్పటినుంచీ అనేది ప్రభుత్వం చెప్పిన తర్వాతే ఉండొచ్చు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్‌డౌన్ విధించింది. ఏప్రిల్ 14 వరకు అనుకున్నప్పటికీ, కేసుల వ్యాప్తి పెరగడంతో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది. అయితే, ఎప్పటికప్పుడు ఎయిర్‌లైన్స్ నిర్ణయాలను కొట్టిపారేస్తున్న కేంద్రం ఆజ్ఞలతో విమాన ప్రయాణికులకు మళ్లీ నిరాశే ఎదురైంది.

Tags: coronavirus, airlines tickets, air india, Hardeep Singh Puri, Civil Avaition Ministry, Lockdown 2.0

Advertisement

Next Story

Most Viewed