నా బ్యాట్ కొట్టేశారు: భజ్జీ

by Shyam |
నా బ్యాట్ కొట్టేశారు: భజ్జీ
X

దిశ, వెబ్ డెస్క్: తన క్రికెట్ కిట్‌లోని బ్యాట్ మాయమైందని, దానిపై వెంటనే విచారణ జరపాలంటూ ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు. విషయమేమిటంటే.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో హర్భజన్ సింగ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో విమానంలో ముంబై నుంచి కోవైకు చేరుకున్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న క్రికెట్ కిట్‌ను పరిశీలించాడు. కానీ, ఆ కిట్‌లో బ్యాట్ కనబడలేదు. దీంతో వెంటనే అతను సోషల్ మీడియా ద్వారా సదరు విమాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతామని, మీ బ్యాట్ ఆచూకీ కనుగొని అప్పగిస్తామని ఆ సంస్థ వివరణ ఇచ్చింది.

tags: Harbhajan singh, bat, missing, airport

Advertisement

Next Story