- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుమారుడికి జన్మనిచ్చిన భజ్జీ భార్య గీత
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు వెల్లడించాడు. భజ్జీ, గీతా దంపతులకు ఇది వరకే హినాయా అనే చిన్నారి పాప ఉన్నది. ‘మేం పట్టుకోవడానికి మరో చిన్నారి చేయి మా ఇంటికి వచ్చింది. అతడి ప్రేమ అమితమైనది. బంగారం లాంటి విలువైన బహుమతి. ఈ క్షణాలు మాకు ఎంతో మధురమైనవి, ప్రత్యేకమైనవి. ఇప్పుడు మా జీవితాలు సంపూర్ణమయ్యాయి. నా భార్య, చిన్నారి క్షేమంగా ఉన్నారు. ఈ అద్భుత క్షణాలను ఆస్వాదిస్తున్నాను. మా మంచి కోసం ఆలోచించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని హర్భజన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. కాగా 2015 అక్టోబర్ 29న పంజాబ్‌లో హర్భజన్, గీతా బస్రా వివాహం జరుగగా.. 2016లో వారికి పాప పుట్టింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న హర్భజన్.. సెప్టెంబర్‌లో జరగాల్సిన రెండో విడత ఐపీఎల్ మ్యాచ్‌లలో పాల్గొనాల్సి ఉన్నది.