ఐపీఎల్‌ నిర్వహిస్తేనే మంచిది : భజ్జీ

by vinod kumar |
ఐపీఎల్‌ నిర్వహిస్తేనే మంచిది : భజ్జీ
X

ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కరోనా దెబ్బతో ఈ ఏడాది వాయిదా పడింది. ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే అవకాశం లేదు. కాగా, ఐపీఎల్ నిర్వహణపై పలువురు క్రికెటర్లు తమ సూచనలు, సలహాలు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ‘స్టార్ స్పోర్ట్స్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్ హర్బజన్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఐపీఎల్‌పై ఆధారపడి చాలా మంది జీవితాలు ఆధారపడ్డాయని.. కాస్త అటు ఇటైనా 13వ సీజన్ నిర్వహించడమే మేలని అన్నాడు. కేవలం క్రికెటర్లే కాకుండా గ్రౌండ్ సిబ్బంది, సహాయక సిబ్బంది, ప్రసార మాధ్యమాల్లో పనిచేసే వాళ్లకు ఈ లీగ్ ద్వారా ఎంతో కొంత ఆదాయం లభిస్తుంటుంది. ఒకవేళ ఐపీఎల్‌ను ఈ ఏడాది పూర్తిగా రద్దు చేస్తే, వాళ్ల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యే అవకాశం ఉందని భజ్జీ అన్నాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ మైదానాల్లో ఆడేందుకైనా మేము సిద్ధమేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘అలా ఆడటం ఒక ఆటగాడిగా ఇష్టం లేకపోయినా, తప్పదని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఈ మెగా ఈవెంట్ నిర్వహించాలని’ హర్భజన్ కోరుతున్నాడు.

Tags : IPL, Harbhajan singh, Corona, star sports

Advertisement

Next Story

Most Viewed