కమల్‌నాథ్ ఇంట ‘చాలీసా’ పఠనం

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ మంగళవారం తన నివాసంలో హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజకు ఒక రోజు ముందే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కొవిడ్ 19 ప్రొటోకాల్స్‌లన్నీ అమలవుతాయని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్రగుప్తా తెలిపారు.

కమల్‌నాథ్ హనుమంతుడి భక్తుడని, మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు తమ నివాసాల్లో హనుమాన్ చాలీసాను పఠించాలని కోరినట్టు గుప్తా వివరించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కారణమడగ్గా, మంగళవారం మంగళకరమైన రోజు కాబట్టే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అందరి ఆమోదంతో నిర్మితమవుతోందని కమల్‌నాథ్ శనివారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement