ధనుష్‌తో మరోసారి హన్సిక

by  |
ధనుష్‌తో మరోసారి హన్సిక
X

‘దేశ ముదురు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ హన్సిక.. అతి తక్కువ టైమ్‌లోనే క్రేజీ హీరోయిన్‌‌గా ఎదిగింది. ఓ దశలో తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. క్రమంగా అవకాశాలు సన్నగిల్లడంతో ప్రస్తుతానికి అడపాదడపా తమిళ చిత్రాల్లో కనిపిస్తున్నా.. గుర్తుండిపోయే పాత్రలు దక్కడం లేదు. మంచి వెయిటేజ్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న తరుణంలో.. ‘మహా’ చిత్రం ఆఫర్ వచ్చింది. అందులో ప్రాముఖ్యత ఉన్న కథానాయిక పాత్రలో హన్సిక నటిస్తుండగా.. తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఆమె తలుపు తట్టినట్లు సమాచారం.

ధనుష్.. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో అని దర్శక , నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండటంతో.. ఓ హీరోయిన్‌గా హన్సికను తీసుకోవాలని వాళ్లు భావిస్తున్నారు. ఇందుకు హన్సిక కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. హన్సిక ఇప్పటికే.. ‘మాపిళ్లై’ అనే చిత్రంలో ధనుష్‌కు జోడీగా నటించింది. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ తన అభిప్రాయాను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఈ బ్యూటీ ఇన్‌స్టా వేదికగా.. ఓ మంచి ఆఫర్ ఇచ్చింది. హన్సికకు అర్జెంట్‌గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తోందట. అందుకే తనను ఎవరైనా బయటకు తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపించమని రిక్వెస్ట్ చేస్తోంది. సో మరి.. హన్సిక ఐస్ క్రీమ్ కోరికను ఎవరు తీరుస్తారో చూడాలి.


Next Story