- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ.. ఇక వాటిపైనే దృష్టి
దిశ ప్రతినిధి, మెదక్ : ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హన్మంతరావు అధికారులని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హన్మంతరావు మొట్టమొదటగా ధాన్యం కొనుగోలు అంశం పై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో రెవెన్యూ, సహకార, పౌర సరఫరాలు, ఐకేపీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో సరిపడా స్టోరేజ్ పాయింట్‌లను తహశీల్దార్‌ల సహాయంతో వెంటనే గుర్తించాలన్నారు. రైతులకు సాధ్యమైనంత త్వరగా పే మెంట్‌లు జరిగేలా చూడాలని చెప్పారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, రెవెన్యూ డివిజన్ అధికారులు జయ చంద్రా రెడ్డి, విజయేంద్ర రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, డీఆర్ డీవో గోపాల్ రావు, జిల్లా సహకార అధికారి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.