- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు చేనేత కార్మిక నేత వాట్సప్ మెసేజ్.. ఎందుకంటే !
దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత, మర మగ్గాల కార్మికుల కష్టాలు స్వయంగా తెలుసుకున్న సీఎం కేసీఆర్ మరోసారి ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. కరోనా కారణంగా 5నెలలు, అతివృష్టి కారణంగా నేత పని సజావుగా సాగడం లేదని, మగ్గం గుంతల్లో నీళ్లు చేరడంతో పనులు జరగట్లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మరోసారి త్రిఫ్టు ఫండ్ కింద సాయం, పలు పథకాలను అమలు చేయాలని మంత్రి కేటీఆర్‌కు ఆదివారం చేనేత కార్మిక సంఘం తరపున ఎల్బీనగర్ అధ్యక్షుడు చెర్కు స్వామినేత ట్విట్వర్, వాట్సాప్ ద్వారా కోరారు. శుభ ముహూర్తాలు లేకపోవడం, కరోనా కష్టాలు, అతివృష్టి వంటితో కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, నేతన్నకు చేయూత పథకంలో 8శాతం జమ చేయడం కూడా కార్మికులకు కష్టంగా మారిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వం జమ చేసే 16శాతం నిధిని ప్రతి నేతన్నకు ఖాతాల్లో జమ చేయించాలని విజ్ఞప్తి చేశారు.