మావోయిస్టు మృతదేహం… బంధువులకు అప్పగింత

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండలంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు వివరాలను సేకరించామని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఛత్తీస్‌ఘడ్‌లోని సుకుమా జిల్లా అర్లపల్లి గ్రామం, పొలంపల్లికి చెందిన దూడి దేవా అలియాస్ దేవాలు అలియాస్ శంకర్‌గా గుర్తించామని స్పష్టం చేశారు.

కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉంచిన మృతదేహాన్ని ఈ రోజు బంధువులకు అప్పగించ్చినట్టు తెలిపారు.మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి హరిభూషన్ కు స్పెషల్ ప్రొటెక్షన్ టీం కమాండర్(ఏసీఎం)గా మరియు యాక్షన్ టీం మెంబెర్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement