- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తుపాకీ దొరికిందని గ్రామ కార్యదర్శికి అప్పగిస్తే.. దానిని ఆయన ఇలా చేశాడు
దిశ, తాండూరు: ఉపాధి పనుల కోసం వెళ్లిన కూలీలకు నాటు తుపాకీ(తపంచా) లభ్యమైంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో అడాల్‌పూర్ అడవుల్లో బుల్లెట్ మ్యాగ్జిన్ లభ్యమైన విషయం తెలిసిందే. తాజాగా బాణాపూర్ అటవీ ప్రాంతంలో నాటు తుపాకీ లభ్యమవడంతో ఆందోళన రేకెత్తుతోంది. గత కొన్ని రోజుల నుంచి బాణాపూర్‌లో జాతీయ ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 16న గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు నాటు తుపాకీ(తపంచా) లభ్యమైంది. దానిని గ్రామ కార్యదర్శి రాములుకు అప్పగించారు. ఆయన దానిని యాలాల పోలీసులకు అప్పగించారు. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో యాలాల మండలంలో కలకలం రేగింది. కొన్ని రోజుల క్రితమే నాటు తుపాకీ లభ్యమైనా.. పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
యాలాల మండలంలో అటవీ ప్రాంతాలు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో జోరుగా వేట కొనసాగుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దుప్పి, అడవి పందులను వేటాడుతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.