డబ్ల్యూహెచ్ఓ‌కు నిధులు నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం

by  |
డబ్ల్యూహెచ్ఓ‌కు నిధులు నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం
X

వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఆ సంస్థకు నిధులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్‌వో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, చైనాకు పక్షపాతిగా మారిందని గతంలో ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా నిధులు నిలిపివేయడమే కాకుండా ఆ సంస్థపై విరుచుకుపడ్డారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తిని సరిగ్గా అంచనా వేయడంలో డబ్ల్యూహెచ్‌వో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 20 శాతం అదనంగా పెరిగిందని దుయ్యబట్టారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఆ సంస్థకు నిధులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాగా, గత ఏడాది డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి 400 మిలియన్ డాలర్ల నిధులు అందాయి.
డబ్ల్యూహెచ్‌వో‌కు అమెరికా నిధుల నిలిపివేతపై యూఎన్‌వో ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిధులను నిలిపివేయడం సరైన నిర్ణయం కాదన్నారు. కరోనాపై విజయం సాధించాలంటే ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని సూచించారు.

Tags: us president, trump, WHO, UNO


Next Story

Most Viewed