- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధ్యతలడిగితే షారుఖ్ నిరాకరించాడు: గంగూలీ
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ తొలి సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆ జట్టు బాధ్యతలన్నీ తనకు అప్పగించమని కోరాను. కానీ, ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. 2011లో జట్టుకు కెప్టెన్ అయ్యాక పూర్తి స్వేచ్ఛను షారుఖ్ తనకు ఇచ్చినట్లు గౌతమ్ గంభీర్ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనిపై స్పందించిన గంగూలీ ‘తొలి సీజన్‌లోనే తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వమని అడిగినా షారుఖ్ నిరాకరించాడు. ఐపీఎల్‌లో ఉత్తమ జట్లగా ఉన్న ఆయా ఫ్రాంచైజీలను చూడండి. యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాయి. చెన్నై జట్టును ధోనీ నడిపించే విధానం చూడండి. ముంబయి ఇండియన్స్ జట్టుపై రోహిత్‌కు ఉన్న పట్టును చూడండి’ అని దాదా చెప్పాడు. కెప్టెన్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తే మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయని గంగూలీ అన్నాడు. ఇక అప్పటి కోచ్ బుచానన్ కారణంగానే తాను కెప్టెన్సీ కోల్పోయానని చెప్పాడు. బుచానన్ ఆలోచనా విధానానికి తన ఆలోచనా ధోరణి చాలా విభిన్నమని గంగూలీ చెప్పాడు. ఐపీఎల్‌లో తొలి సీజన్ పూర్తయిన వెంటనే కేకేఆర్ జట్టులో సమస్యలు మొదలయ్యాయని గంగూలీ వెల్లడించాడు.