- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టార్ హీరోతో ‘గుత్తా జ్వాలా’ మ్యారేజ్ ఫిక్స్

X
దిశ, సినిమా: బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. కొంత కాలంగా కోలీవుడ్ హీరో విష్ణువిశాల్‌తో ప్రేమలో ఉన్న జ్వాల.. అతనితో పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు త్వరలోనే తాము మ్యారేజ్ చేసుకోబోతున్నామని కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంటకు ఇది రెండో వివాహం కావడం విశేషం. 2005లో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను పెళ్లాడిన గుత్తా జ్వాల, ఆ తర్వాత 2011లో విడాకులు తీసుకుంది. మరోవైపు 2010లో రజనీ నటరాజ్‌ను వివాహమాడిన విష్ణు విశాల్ కూడా 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. త్వరలో పెళ్లితేదీని వెల్లడిస్తామని, తెలుగింటి అల్లుడిని కాబోతున్నందుకు ఆనందంగా ఉందని విష్ణువిశాల్ తెలిపారు.
Next Story