రాష్ట్రాన్ని దోచుకునేందుకే ఆ ‘ముగ్గురు’ ఆరాటపడుతున్నారు : గుత్తా సుఖేందర్

by Shyam |
TRS leader Gutta Sukender Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, వైఎస్ఆర్‌టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వనరులను దోచుకునేందుకు వీరు ముగ్గురు ముందుకు వచ్చారని ఆరోపించారు.

ఏపీలో అవకాశం లేకపోవడం వల్లే హైదరాబాద్, తెలంగాణపై పెత్తనం చెలాయించాలనే ఆలోచనతో షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం కేసీఆర్‌ను అపవిత్రం చేయాలని వీరు ముగ్గురు చూస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని తెలిపారు. ఉపఎన్నికలో విపక్షాలకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు.

Advertisement
Next Story

Most Viewed