వైభవంగా విష్ణు విశాల్, గుత్తా జ్వాల వివాహం

by Jakkula Samataha |   ( Updated:2021-04-22 05:37:20.0  )
వైభవంగా విష్ణు విశాల్, గుత్తా జ్వాల వివాహం
X

దిశ, సినిమా : హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటి వరకు రూమర్డ్ గర్ల్ అండ్ బాయ్ ఫ్రెండ్స్‌గా ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు ఒక్కటయ్యారు. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌లో జరిగిన ఈ ప్రైవేట్ సెర్మనీకి అతికొద్ది మంది బంధుమిత్రులు హాజరుకాగా మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు.

కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక సాంప్రదాయ దుస్తుల్లో వధూవరులు మెరిసిపోతుండగా.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లైట్ బ్లూ కలర్, రెడ్ బార్డర్ కాంబినేషన్‌శారీలో జ్వాల గార్జియస్‌గా కనిపిస్తోంది. గతవారమే నిశ్చితార్థం జరగ్గా.. ఉదయం జరిగిన హల్దీ కార్యక్రమాన్ని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed