కొవిడ్ సోల్జర్‌గా మారిన హీరో.. కారణం అదే..!

by Shyam |
కొవిడ్ సోల్జర్‌గా మారిన హీరో.. కారణం అదే..!
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో గుర్మీత్ సింగ్ చౌదరి కొవిడ్ సోల్జర్‌గా మారిపోయాడు. కరోనా క్రైసిస్‌లో కామన్ మ్యాన్‌కు హెల్ప్ చేసేందుకు 24 గంటలు పనిచేస్తున్నాడు. పాట్నా, లక్నోలో 1000 బెడ్ కెపాసిటీతో హాస్పిటల్ కూడా ప్రారంభిస్తానని తెలిపిన ఆయన.. ఈ కష్టకాలంలో కరోనా సోల్జర్‌గా మారేందుకు కారణమైన సంఘటనను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఢిల్లీ నుంచి కాల్ చేసిన ఓ యువకుడు.. తల్లికి ఆక్సిజన్ లెవల్స్ 40కి పడిపోయాయని, తనకు సాయం చేయాలని కోరాడని తెలిపాడు. ఈ మేరకు తాను బాలీవుడ్ నటుడినని చెప్పి ఒక వైద్యుణ్ణి సాయం కోరడంతో.. ఓకే అన్నాడని, కానీ చివరకు బెడ్ దొరక్కపోవడంతో ఆ తల్లిని కోల్పోయామని తెలిపాడు గుర్మీత్. అప్పటి నుంచి ఆ యువకుడి విజ్ఞప్తి తనను వెంటాడుతూనే ఉందని, అందుకే కరోనాతో చేసే యుద్ధంలో సోల్జర్‌గా ఉండాలనుకున్నానని చెప్పాడు.

తన తాత, తండ్రి ఆర్మీలో పనిచేశారని.. కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ వెళుతున్న వాళ్ల ఆర్మీ ట్రైన్‌ను చూసి ప్రజలు ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చారని చెప్పిన విషయం తనకు ఇంకా గుర్తుందన్న గుర్మీత్.. తను ఇప్పుడున్న ట్రైన్‌లో కలిసి ప్రయాణించేందుకు జనం ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. మన ద్వారా ఒకరు సాయం పొందిన తర్వాత చెప్పే కృతజ్ఞతలు గొప్ప సంతృప్తిని ఇస్తాయని, ఈ కష్టకాలంలో అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చాడు గుర్మీత్.

Advertisement

Next Story