వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా?

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి తరలింపు వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అమరావతి రాజధానిపై ఆశలు పెట్టుకున్న గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేల మాటను అధిష్టానం పట్టించకుకోలేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ఓ హోటల్‌లో గుంటూరు జిల్లాకు చెందిన 15 మంది, కృష్ణా జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ హోటల్‌లో భేటీ అయిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అసెంబ్లీ స్పీకర్‌కు తమ రాజీనామా లేఖలను పంపునున్నట్లు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. అయితే, వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందే అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement