‘సరోజ్ జీ’ మరణం తీరని లోటు : గుణ

by Shyam |
‘సరోజ్ జీ’ మరణం తీరని లోటు : గుణ
X

‘సరోజ్ ఖాన్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చూడాలని ఉంది’ సినిమాకు తనతో కొరియోగ్రఫీ చేయించాలని అనుకున్నామని.. చిరంజీవి హీరో అనగానే వెంటనే ఒప్పేసుకున్నారన్నారు. ముందుగా ఓ మారియా.. ఓ మారియా పాటకు కొరియోగ్రఫీ చేసిన సరోజ్ జీ.. తోట తరణి వేసిన సెట్స్‌పై ప్రశంసలు కురిపించినట్టు తెలిపారు. మణిశర్మ, నేను అప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నామన్న గుణ.. మణిశర్మ బీట్స్ విని మ్యూజిక్ ఎవరు చేశారని అడిగారని.. తన గురించి చెప్పగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని చెప్పిందని గుర్తుచేసుకున్నారు. ఓ మారియా ఓ మారియా సాంగ్ కొరియోగ్రఫీ చాలా ఎంజాయ్ చేశామని.. ప్రతీ స్టెప్పుకు యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టేదని చెప్పారు గుణశేఖర్. సినిమా విడుదలయ్యాక కూడా అంతే రెస్పాన్స్ వచ్చిందన్నారు.

ఆ పాట కొరియోగ్రఫీ టైమ్‌లో.. తన ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అయిపోయిన తను.. ‘అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దూ..’ సాంగ్‌కు కూడా తనతోనే కొరియోగ్రఫీ చేయించాలని నిర్మాత అశ్వినీదత్‌ను కోరినట్లు చెప్పారు. తను కూడా ఒప్పుకుందని.. ఆ పాట కూడా పెద్ద హిట్ అయిందని చెప్పారు. ఈ పాటలో సౌందర్య ఎక్స్‌ప్రెషన్స్, చిరు డ్యాన్స్ గ్రేస్ ట్రెండ్ సృష్టించిందని.. అదే ట్రెండ్ ఇప్పుడూ కొనసాగుతోందని చెప్పారు. లెజెండరీ కొరియోగ్రఫర్ అయినా సరే.. కొత్తవారికి ఆమె ఇచ్చే ప్రోత్సాహం అద్భుతమన్నారు. సరోజ్ జీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు గుణశేఖర్.

Advertisement

Next Story

Most Viewed