బయోమెడికల్ వేస్ట్‌తో.. బ్రిక్స్ తయారీ

by  |
బయోమెడికల్ వేస్ట్‌తో.. బ్రిక్స్ తయారీ
X

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనాను నిరోధించేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్స్ నుంచి సామాన్యుల వరకు అందరం మాస్క్‌లు ఉపయోగిస్తున్నాం. ఇక అత్యవసర వైద్య విభాగాలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్న వాళ్లు పీపీఈ కిట్లు, గౌన్స్, ఫేస్ కవర్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా కొవిడ్ మొదలైనప్పటి నుంచి రోజురోజుకూ వీటి ఉపయోగం పెరిగిపోతుండటంతో మెడికల్ చెత్త అంతకంతకూ పేరుకుపోతోంది. ఇది ఓ పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వేస్ట్‌ను.. ది బెస్ట్‌గా మలిచి శభాష్ అనిపించుకుంటున్నాడు గుజరాత్‌కు చెందిన బినిష్ దేశాయి. ఇంతకీ ఈ మెడికల్ వేస్ట్‌తో బినిష్ ఏం చేస్తున్నాడు?

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) రిపోర్టు ప్రకారం.. భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు 101 మెట్రిక్ టన్నుల కొవిడ్ 19 రిలేటెడ్ బయో మెడికల్ చెత్త పోగవుతుందని సమాచారం. ఇదేగాక ప్రతిరోజు.. 609 మెట్రిక్ టన్నుల నార్మల్ బయోమెడికల్ వేస్ట్ కూడా జనరేట్ అవుతోంది. మరి ఇంత చెత్తను ఏం చేయాలి? ఏం చేస్తే ఉపయోగం ఉంటుంది? అన్న ఆలోచనలను ప్రభుత్వాలు చేయట్లేదు కానీ.. ప్రకృతిని ఆరాధించే బినిష్ ఆ దిశగా అడుగులు వేశాడు. ఆ క్రమంలోనే మెడికల్ చెత్త ఎక్కువగా పోగయ్యే పబ్లిక్ ప్రాంతాల్లో(ఆస్పత్రులు, సెలూన్స్, బస్టాప్స్, స్కూల్స్, ప్రార్థన మందిరాలు) ‘ఎకో బిన్స్’ను ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ పోగైన చెత్తనంతా సేకరించి, రీసైకిల్ చేస్తూ.. దాంతో ‘బ్రిక్స్’ తయారు చేస్తున్నాడు. అందుకే ఆ యువకుడిని ‘రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ‘బి డ్రీమ్’ అనే కంపెనీని స్థాపించిన బినిష్.. ఇండస్ట్రియల్ వేస్ట్‌తో బిల్డింగ్ మెటీరియల్ తయారు చేస్తుంటాడు. ఆ క్రమంలోనే.. పేపర్ మిల్స్‌లోని వేస్ట్‌ మెటీరియల్‌తో ఇదివరకు పీ-బ్లాక్ అనే బ్రిక్స్ తయారు చేశాడు. ఇప్పుడు అదే క్రమంలో.. కొవిడ్ -19 రిలేటెడ్ బయోమెడికల్ వేస్ట్‌తో ‘బ్రిక్స్’ రూపొందించాడు. వీటికి ‘పి బ్లాక్ 2.0’ అనే పేరును పెట్టాడు.

పి బ్లాక్ 2.0 బ్రిక్స్ :

ఈ బ్రిక్స్ తయారీలో 52 శాతం పీపీఈ మెటీరియల్, 45 శాతం పేపర్ స్లడ్జ్, 3 శాతం బైండింగ్ ఏజెంట్‌ను ఉపయోగిస్తున్నాడు. ఒక్కో బ్రిక్ 12x8x4 పరిమాణంలో ఉంటుంది. ఒక గజం పరిమాణంలో ఇటుక తయారు చేయడానికి కనీసం 7 కిలోల బయోమెడికల్ వేస్ట్ కావాల్సి వస్తుంది. ఈ ఇటుకలు చాలా లైట్ వెయిట్‌తో ఉన్నా, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంతేకాదు ఇవి వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్ కావడం విశేషం. వీటి ఖరీదు రూ. 2.8/-

‘ఫేస్‌మాస్క్ మన నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయింది. అయితే సింగిల్ యూజ్ ఫేస్ మాస్క్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భూమిపై ఎక్కువ మొత్తంలో చెత్త పోగవుతోంది. వీటితో పాటు గౌన్స్, హెడ్ కవర్స్‌ను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దాంతో ఈ మెడికల్ చెత్తను కొంతలో కొంత తగ్గించే ప్రయత్నం చేయాలనుకున్నాను. ఇందుకోసం నా మెడికల్ ల్యాబ్‌లోనే ప్రయోగం ప్రారంభించాను. అనుకున్నట్లుగానే బయో మెడికల్ వేస్ట్ నుంచి బ్రిక్స్ తయారు చేశాను. క్వాలిటీపరంగా కూడా అవి నాకు సంతృప్తినిచ్చాయి. దాంతో కొన్ని శాంపిల్స్‌ను లోకల్ ల్యాబ్‌కు పంపించాను. అక్కడ కూడా ఈ బ్రిక్స్ టెస్ట్ చేసి, ఆమోదం తెలిపారు’ అని బినిష్ తెలిపాడు.

కరోనా పాండమిక్ వల్ల.. సర్టిఫికేషన్ కోసం నేషనల్ లెవెల్ ల్యాబ్స్‌కు ఇంకా పంపించలేదని, కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాబ్ నుంచి వీటికి అనుమతి వచ్చిందని బినిష్ పేర్కొన్నాడు. డ్యూరబిలిటీ విషయంలో అన్ని రకాల టెస్ట్‌లు పాస్ అయ్యిందని బినిష్ తెలిపాడు.


Next Story

Most Viewed