సెకన్లలో 3 బాటిల్స్ ఫ్లిప్ చేసి.. వరల్డ్ రికార్డ్ సృష్టించిన టీనేజర్

by Shyam |
bottle1
X

దిశ, ఫీచర్స్: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తరచుగా వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనేక ప్రపంచ రికార్డులను హైలైట్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే మరొక కొత్త ప్రపంచ రికార్డు వీడియోను తాజాగా పంచుకుంది. మూడు ప్లాస్టిక్ బాటిళ్లను అత్యంత వేగంగా ఫ్లిప్ చేయగా, వాటిని వెంటవెంటనే అత్యంత వేగంగా ఫ్లిప్ చేసి రికార్డ్ సృష్టించాడు. అతడి పేరు బ్రెండన్ కెల్బీ కాగా ఈ ఫీట్‌కు గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు.

బాటిల్‌ను ఫ్లిప్ చేయడం చాలా సాధారణ విషయంగా అనిపించొచ్చు కానీ, దాన్ని ఫ్లిప్ చేయడంలోనూ టెక్నిక్‌తోపాటు ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఎంత సాధన చేసినా.. ఏమాత్రం సరిగా చెయ్యకపోయినా బాటిల్ సరిగా నిలబడదు. అలాంటిది బ్రెండన్ మూడు వాటర్ బాటిల్స్‌ను వెనువెంటనే కేవలం 2.09 సెకన్లతో ఫ్లిప్ చేసి ఔరా అనిపించాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ చేయడంతో గిన్నిస్ రికార్డ్ వరించింది.

ఓ భారతీయ యువకుడు 60 సెకన్లలో అత్యధికంగా ప్లాస్టిక్ బాటిల్‌ను తిప్పిన ప్రపంచ రికార్డును ఈ ఏడాది జనవరిలో బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అబూదాబిలో ఇంటర్ చదువుతున్న జోయెల్ మాథ్యూ కళ్లకు గంతలు కట్టుకుని అమెరికన్ జోష్ హోర్టన్ నెలకొల్పిన నిమిషంలో 27 బాటిల్ ఫ్లిప్‌ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. మాథ్యూ కూడా కళ్లకు గంతలు కట్టుకుని, పాక్షికంగా నింపిన 500 మి.లీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను 60 సెకన్లలో 37 సార్లు ఫ్లిప్ చేయడం విశేషం.

వైరల్: బాటిల్ ఫ్లిప్పింగ్ వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయ్యాయి. అంతేకాదు దీనిపై బోలెడన్నీ సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. కొందరైతే బాటిల్ ఫ్లిప్ చేస్తే ప్రైజ్‌మనీ కూడా అందిస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే ఓ కుమారుడు తన తల్లి దగ్గరికి వెళ్లి..‘ఈ బాటిల్‌ని గాల్లోకి విసిరి (bottle flip challenge)… తిరిగి అలాగే నిలబెట్టాలి. అలా చేస్తే నీకు రూ.2000 ఇస్తాను’ అంటూ ఫ్లిప్ చాలెంజ్ విసిరాడు. ఆమె ఏమాత్రం సంకోచించకుండా బాటిల్‌ని గాల్లో ఎగరేసి, ఫ్లిప్ చాలెంజ్ పూర్తి చేయడంతో కొడుకు షాక్ అయ్యాడు. తల్లికి రూ.2వేలు ప్రైజ్ మనీ ఇచ్చుకున్నాడు. ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది. ఇక బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ సెప్టెంబర్‌లో ఫ్లిప్ బాటిల్ చాలెంజ్‌ను స్వీకరించి అద్భుతంగా ఫినిష్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానుల నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed